SKLM: రణస్థలం మండలంలో రూ.40 లక్షల నిర్మించిన 5 సీసీ రోడ్లను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.