TG: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. లక్ష కోట్ల అవినీతి అని తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రపంచంలో అరుదైన ప్రాజెక్టు. తెలంగాణలో కాళేశ్వరం ద్వారానే 70 శాతం సాగునీరు అందిస్తున్నారు. వ్యవసాయ అభివృద్ధికి KCR కృషి చేశారు. రేవంత్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. మళ్లీ KCR పాలన ఖాయం’ అని వెల్లడించారు.