»Mahua Moitra Vacates Delhi Bungalow Days After Eviction Notice
Mahua Moitra: బంగ్లా ఖాళీ చేసిన ఎంపీ
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తన ఢిల్లీ బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో ఆమె తన ఎంపీ బంగ్లాను వెంటనే ఖాళీ చేయక తప్పలేదు.
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తన ఢిల్లీ బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో ఆమె తన ఎంపీ బంగ్లాను ఖాళీ చేయక తప్పలేదు. ఆమెను అర్జెంటుగా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన ఓ టీమ్ కూడా అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన బంగ్లా ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ సంస్థ ఇచ్చిన నోటీసును మహువా మోయిత్రా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. పూర్వా పరాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు నోటీసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమెకు మరో దారి లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తన బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా గత కొన్నేళ్లుగా నరేంద్రమోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉన్నారు. పార్లమెంట్ లోపల, బయటా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా పదునైన ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. ఆమె ఈ విధంగా వ్యవహరించడానికి కొన్ని బాహ్య శక్తులు ప్రభావితం చేశాయని బీజేపీ పెద్దలు గ్రహించారు. ఆమెపై నిఘా ఉంచారు. ఆమె గుట్టును రట్టు చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ.. మహువా మోయిత్రాకు గత కొంత కాలంగా పరిచయం ఉంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు గాను.. హీరానందానీ నుంచి ఆమె ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. విచారణ అధికారులు తాము సేకరించిన సమాచారం ప్రభుత్వానికి అందజేశారు. అదే విధంగా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ కూడా మహువా మోయిత్రాను విచారించింది. ఆమెను దోషిగా తేల్చింది. దీంతో ఆమెకు లోక్సభ నుంచి ఉధ్వాసన పలికారు. పనిలో పనిగా ఆమెకు కేటాయించిన బంగ్లాను కూడా ఖాళీ చేయించారు.