NRML: జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ వీటిని అందుకున్నారు. కొయ్యబొమ్మల పరిరక్షణకు చేపట్టిన ‘పొనికి వనం’, మాతా శిశు సంరక్షణ కోసం అమలు చేస్తున్న ‘అమ్మ రక్షిత’ పథకాలకు ఈ జాతీయ గుర్తింపు దక్కింది. ఈ విజయంపై ముఖ్యమంత్రికి, మంత్రులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.