అనకాపల్లి డివిజన్లో ఇంటి పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీడీవో మంజులావాణి హెచ్చరించారు. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు. 325 పంచాయతీలలో రూ.26.34 కోట్లలో రూ.20.75 కోట్లు వసూలయ్యాయని, మిగిలిన రూ.5.59 కోట్లు నెలాఖరులోగా వసూలు చేయాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.