RCBపై కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. SRH తరఫున కెప్టెన్సీ డెబ్యూలో అత్యధికంగా 80 పరుగులు చేసిన సారథిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ మనీష్ పాండే(2021లో 69* vs MI) పేరిట ఉండేది. డేవిడ్ వార్నర్(2015లో 53 vs CSK) తర్వాతి స్థానంలో ఉన్నాడు. కాగా నిన్నటి మ్యాచ్లో SRHపై RCB 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.