MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నేరాలు అదుపునకు చర్యలు తీసుకుంటున్నామని, శాంతి భద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని స్థానిక ఎస్సై గోపతి సురేష్ కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 13, 14, 15 వార్డులలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత అంశాలపై ఆయన అవగాహన కల్పించారు.
వార్తలు
నేరాల అదుపునకు గట్టి చర్యలు


