హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కేరళంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు వీడీ సతీషన్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రతి ఏడాదికి రూ.800 కోట్లు కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఈ పథకం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విషయం తెలిసిందే.