హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ అధికారులపై మంత్రి ఫైర్

AP:గుంటూరు జిల్లా తెనాలిలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో వ్యర్థాలు తొలగించకపోవడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత వాహనాలతో చేయాల్సిన పనికి టెండర్లు ఏంటని ప్రశ్నించారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టాలని హెచ్చరిస్తూ, వ్యర్థాలు తొలగించే వరకు అక్కడే కాల్వగట్టు బల్లపై కూర్చుని పనులు చేయించారు.