కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునేవారు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. ప్రతి 20 నిమిషాలకొకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. తరచూ కనురెప్పలు ఆర్పాలి. వెన్నుముక నిటారుగా ఉంచి, స్క్రీన్ కంటిచూపుకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. గంటకొకసారి సీటు నుంచి లేచి కొద్దిగా నడవాలి. చేతులు, మెడను స్ట్రెచ్ చేయాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజంతా తగినంత నీరు తాగాలి.
ఆరోగ్యం
కంప్యూటర్ల ఎదుట కూర్చునేవారు ఇలా చేయండి


