AKP: నక్కపల్లి మండలం రేబాకలో గ్రామ దేవత గూడుపమ్మ తల్లి పండగను రేపటి నుంచి రెండు రోజులు పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 30న గ్రామంలో పెద్ద ఎత్తున జాతర, ఊరేగింపు, ఊయల ఉత్సవం జరుగుతుందని పూజారులు, గ్రామ పెద్దలు తెలిపారు. 31వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయన్నారు. అన్న సమారాధన మధ్యాహ్నం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.