NZB: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన, ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ మహిళా ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిజామాబాద్‌తో తనకు సంబంధం లేదని గతంలో వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు మళ్ళీ ‘నిజామాబాద్ కోడలిని’ అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.