CTR: జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్టార్ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.