అన్నమయ్య: మంత్రి మండిపల్లి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న రాయచోటి కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా మంత్రి చెప్పులు వేసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ‘ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు చెప్పులతో పూజలు చేయగా లేనిది ఆయన చెప్పులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తే తప్పేమిటి అనుకున్నాడో ఏంటో’ అని YCP ట్విట్టర్లో రీట్వీట్ చేసింది.