WGL: వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం పూర్వ ఖాదీ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్వాగతం పలకగా, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మల్లేశం తెలిపారు.