ASR: మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో “మీ ఇంటికి మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా నూతనంగా మంజూరైన అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి రాలేని రోగుల కోసం, వైద్యులే ప్రజల ఇళ్ళ వద్దకు వెళ్లి చికిత్స అందిస్తారన్నారు.