ADB: తాంసి మండలంలోని కప్పర్ల సీతారామస్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సూర్య కిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడటం జరిగిందని ఆలయ అర్చకులు విశాల్ శర్మ తెలియజేశారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని రామచంద్రుల వారి పాదాలను సూర్యకిరణాలు తాకడం స్వామివారి మహిమగా గ్రామస్తులు భావించారు.