హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలులో 15న డీఆర్సీ సమావేశం

Advertisement

KRNL: కర్నూలు జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం ఈ నెల 15న మధ్యాహ్నం 2:30 గంటలకు కలెక్టరేట్‌లో జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టనున్నారు. సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement