అన్నమయ్య: శ్రీరామనవమి పండుగను ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.