హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధితో కన్నుమూశాడు. ‘Grey’s Anatomy’, ‘Euphoria’ వంటి సిరీస్‌లతో పాటు ‘X-Men’, ‘Bad Boys’ సినిమాలతో ఆయన గుర్తింపు పొందాడు. కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే ఈ ప్రాణాంతక వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం లేదు. అభిమానులు తమ అభిమాన నటుడికి నివాళులర్పిస్తున్నారు.