హైదరాబాద్ (Hyderabad) లోని ట్యాంక్ బండ్ పై దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన విగ్రహాలు నిమజ్జనం (Immersion) కోసం బారులు తీరాయి. ఒకవైపు నిమజ్జనం క్రేన్లు ఏర్పాటు చేయడంతో ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుంది. అటు పండుగకు ఊర్లకు వెళ్లినవారు ఇప్పుడిప్పుడే నగరానికి వస్తుండటంతో రోడ్ల పై ట్రాఫిక్ కాస్త పెరిగింది. బుధవారం రాత్రి నుంచి అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. దుర్గాదేవి (Durga devi) నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో ట్యాంక్ బండ్ (Tank bund) వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా విగ్రహాలు తరలి రావడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) నెలకొంది.