యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలని.. తమకు ఫాలోవర్లు పెరగాలని కొందరు చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. అలాగే ఓ యువకుడు ఓ విన్యాసం చేయగా ఫాలోవర్లు కాదు పోలీసులు వచ్చారు. రూ.31 వేల జరిమానా వేశారు. దీంతో ఆ యువకుడు లబోదిబోమని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ యువకుడు జైల్లో బందీగా ఉన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసుల అదుపులో బైక్ పై బీర్ తాగిన అనూజ్
వివరాలు ఇలా ఉన్నాయి.. గజియాబాద్ పరిధిలోని నూర్ పుర్ ప్రాంతానికి చెందిన అనుజ్ తన స్నేహితుడు అభిషేక్ కుమార్ బుల్లెట్ బైక్ తీసుకున్నాడు. సరదాగా ఢిల్లీ- మీరట్ జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. ఈ సమయంలో బీర్ తాగుతూ బైక్ నడిపే రీల్ ను చేశాడు. బుల్లెట్ పై బీర్ టిన్ తాగుతూ బైక్ నడుపుతుండగా వేరే బైక్ పై అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచగా.. అతడి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పోలీసులు చూడడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు.
అనూజ్ కు పోలీసులు పంపిన రూ.31 వేల చలాన్
రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా బైక్ నడుపుతూ బీరు తాగడం నేరం. దీనికి తోడు హెల్మెట్ ధరించలేదు. పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ యువకుడికి పోలీసులు ఊహించని రీతిలో రూ.31 వేల జరిమానా విధించారు. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఒక విన్యాసం అతడికి ఎంత కష్టమొచ్చిందో తెలుసుకోండి. మీరు ఇలాంటి విన్యాసాలు చేస్తే మీకు ఇదే గతి పడుతుంది.
बुलेट है कोई बात नहीं, सब रास्ता देंगे, लेकिन खुल्लेआम बियर पीते हुए.. बिना हेलमेट.. बुलेट चलाओगे तो!! रील बनाने के चक्कर में 31000 रुपए का चालान आ गया न…. अब झेलो.. महंगी पड़ी ये रील.. इतना तो एड भी नहीं मिल रहा होगा यू ट्यूब से भाई को.. pic.twitter.com/cSEUMsWGfx