ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్లో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. మార్కెట్కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా, నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 వేల ధర లభించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు.