NTR: విజయవాడలో 3వ NTPC ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తొలి బాణాన్ని విడుదల చేసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్చర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా యువ క్రీడాకారులకు తమ ప్రతిభను కనబరిచే మంచి వేదిక అన్నారు.