ATP: కళ్యాణదుర్గం శ్రీ అక్కమాంబ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఘనంగా జరుగుతోంది. జాతరకు వచ్చే భక్తులు ఆకలితో వెళ్లకూడదనే లక్ష్యంతో లక్ష మందికి పైగా భోజన వసతి కల్పించారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు స్వయంగా వడ్డిస్తూ సేవలందిస్తున్నారు.