మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా. జె. జయప్రద తెలిపారు. ప్రవేశాలు రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా కల్పిస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.