BHNG: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నాయి బ్రాహ్మణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ, శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు.