TPT: ఉగాది పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్‌ను సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.