అన్నమయ్య: బి.కొత్తకోట మండలంలో భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో గట్టు (P) గుట్టపాలెం సమీపంలోని రైతు శ్రీనివాసులు రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో ఉన్న ఓ టెంకాయ చెట్టుపై పిడుగు పడింది. పిడుగు ధాటికి చెట్టు ఒక్కసారిగా నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి.ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.