AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై ఇవాళ కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేస్తారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు.