సీఎం కేసీఆర్ కోసం తాము చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు.
కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎలా వస్తావని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన బీజేపీని గురించి కామెంట్ చేశారు. ఇక ఎవరిని భయపెట్టాలని అనుకున్నా భయపడేది లేదని పేర్కొన్న ఆయన తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని వారు చావడానికైనా చంపడానికి అయినా సిద్ధమని అన్నారు.
ఇక పార్టీ కోసం కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని పేర్కొన్న ఆయన త్వరలో క్రీడా పాలసీ తీసుకొస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ప్రసక్తే లేదని, 2023లో అతిపెద్ద జోక్ ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇక పోలవరం విషయంలో సీఎం కేసీఆర్ విశాల దృక్పథంతో పనిచేస్తారని ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.