KMM: మాజీ సర్పంచ్ అంతిమయాత్రలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆమె పాడే మోశారు. ముదిగొండ మండలం ఖానాపురం మాజీ సర్పంచ్ పొదిల విజయలక్ష్మి అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి విజయలక్ష్మి చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు.