GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు.