NGKL: పదర మండలంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామిని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అనురాధ శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.