TG: దేశంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించడానికి ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టిని సారించినట్లు తెలిపారు.