NDL: కోయిలకుంట్ల పట్టణంలోని సంతపేటలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. వేసవిలో ఉచిత మంచినీటిని ప్రజలకు అందించడమే తమ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.