TG: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఓపెన్ రోడ్ సేఫ్టీ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ మేకింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు 30-90 సెకన్ల వీడియోను తమకు పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఫిల్మ్ మేకర్లు, డైరెక్టర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు, విద్యార్థులు పాల్గొనవచ్చు.