MDCL: పదవ తరగతి పరీక్షలను విద్యార్థులు భయపడకుండా ప్రశాంతంగా రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి సూచించారు. శుక్రవారం అల్వాల్ మండల పరిధి కౌకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె పాఠశాల నూతన నేమ్ బోర్డును ఆవిష్కరించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, పరీక్షా కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు.