సత్యసాయి: తాడిమర్రి ప్రాథమిక వ్యవసాయ సహాయక పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా కునుకుంట్ల వడ్డీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో వారధిగా నిలవాలని మంత్రి సూచించారు.