గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చరణ్ ‘RC 17’ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కథ లాక్ అయినట్లు, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.