ఉత్తర అమెరికాలో జరిగే 2026 ప్రపంచ కప్ నిర్వహణ బడ్జెట్ను ఫిఫా వంద మిలియన్ డాలర్ల మేర తగ్గించింది. దీనివల్ల దాదాపు 900 కోట్ల రూపాయల ఖర్చు తగ్గనుంది. ఈ బడ్జెట్ కోత కారణంగా టోర్నీలో భద్రత, రవాణా, లాజిస్టిక్స్ వంటి కీలక సౌకర్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం బడ్జెట్లో పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.