E.G: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. కాగా.. ఇదే ఘటనకు సంబంధించి మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.