ELR: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుకు జిల్లా ప్రగతిని వివరించారు. ఎంఎస్ఎంఈలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను భారీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే పోలవరం గిరిజన ప్రాంత ప్రజలకు ఇళ్ల మంజూరుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.