WGL: న్యూఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు రహదారులకు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయనను కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న నేషనల్ హైవే రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.