SKLM: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు . బీసీ సంఘాల నాయకుల సమక్షంలో ఆమె చిత్రపటానికి పుష్పమాలాంకరణ చేసి, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.