ADB: ప్రజా ప్రతినిధులు రాజకీయాల కంటే అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు వెళ్లాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సర్పంచ్ కౌన్సిలర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ ఐక్యంగా పనిచేసే జిల్లాను అగ్రగామిగా నిలపాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.