హైదరాబాద్: 28°C
వార్తలు

'కొలంగూడకు వెళ్లే దారిలో వాగుపై వంతెన నిర్మించండి'

Advertisement

ASF: తిర్యాణి మండలం మంగి పంచాయతీ కొలంగూడకు వెళ్లే దారిలో వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. వానాకాలం వస్తే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన వారిని ఆసుపత్రికి తరలించాలంటే వాగు దాటలేక ఇబ్బందులు పడుతున్నామని, పాలకులు స్పందించి వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు

Advertisement

Advertisement