బూర్గుల రామకృష్ణరావు.. స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తి. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నిక తర్వాత, హైదారాబాద్ రాష్ట్రానికి(అప్పట్లో తెలంగాణ, మరాఠ్వా, కర్ణాటక ప్రాంతాలు కలిపి) ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన హాయాంలో తీసుకువచ్చిన కౌలుదారి చట్టం ద్వారా భూసంస్కరణలకు నాంది పలికారు. తద్వారా వేలాది మంది పేద రైతులకు భూమిపై హక్కు లభించింది.