దేశంలోని సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు తప్పనిసరిగా సబ్‌టైటిల్స్‌తో పాటు, అంధుల కోసం దృశ్యాలను వివరించే ఆడియో డిస్క్రిప్షన్ ఉండాలని ఆదేశించింది. వినికిడి, దృష్టి లోపం ఉన్నవారు కూడా సినిమాల్లోని భావోద్వేగాలను, శబ్దాలను సులభంగా ఆస్వాదించేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.