TG: మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్‌లో దారుణం జరిగింది. భర్త, అత్త వేధింపులు భరించలేక సుస్మిత అనే నిండు గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపులోని శిశువుకు DNA టెస్ట్ చేయించాలంటూ వారు హింసించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదు, హత్యేనని తల్లి ఆరోపిస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
భర్త, అత్త వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య!
Advertisement
Advertisement
Advertisement


